నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం మెయిన్‌రోడ్‌లో జోయాలుక్కాస్ వరల్డ్స్ ఫేవరేట్ జ్యూవెలర్ షోరూంను శనివారం సాయంత్రం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నజీర్ అహ్మాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరులో రెండో షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. విస్తరణలో భాగంగా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన ప్రతి షోరూంను ఆధునిక ఇంటీరియర్‌లు, విశాలమైన లేఅవుట్‌లు అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు మంచి అనుభూతి అందించేలా రూపొందించారని చెప్పారు. సినీ నటి సౌందర్యరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ మాట్లాడుతూ మూడు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల నిరంతర విశ్వాసం, ఆదరణ తమ వృద్ధికి చోదక శక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి షోరూంలో అత్యుత్తమ నాణ్యత, వినూత్న డిజైన్లు ఉన్నాయని తెలిపారు. సీఓఓ హెన్రీ గెర్గో, మార్కెటింగ్ హెడ్ అనిష్‌వర్గేష్, రిటైల్ హెడ్ రాజేష్‌కృష్ణన్, రీజనల్ మేనేజర్ రాజేష్ ఓఎస్ పాల్గొన్నారు.


