పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి | - | Sakshi
Sakshi News home page

పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి

మంగళగిరి టౌన్‌: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్‌ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement