రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ స్పందించాలి: సాకే శైలజానాథ్‌ | Sake Sailajanath Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ స్పందించాలి: సాకే శైలజానాథ్‌

Mar 17 2026 5:50 PM | Updated on Mar 17 2026 6:04 PM

Sake Sailajanath Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు.

..మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement