గుంటూరు మెడికల్‌ కాలేజీకి డబుల్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

గుంటూరు మెడికల్‌ కాలేజీకి డబుల్‌ విజయం

Mar 18 2026 11:11 AM | Updated on Mar 18 2026 11:11 AM

● డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి మాట్లాడుతూ పరిశోధన అనేది వైద్య రంగంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో మరిన్ని పరిశోధనలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ● డాక్టర్‌ నమ్రితా.. రేబీస్‌ సమగ్ర నిర్వహణ అంశంపై, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హనీ రాజేష్‌ మార్గదర్శకత్వంలో పరిశోధన నిర్వహించారని తెలిపారు. ● డాక్టర్‌ వీణ ప్రియా.. డాక్టర్‌ విష్ణునందన్‌ మార్గదర్శకత్వంలో యాంటీబయాటిక్స్‌ స్వీయ వినియోగధోరణులపై అధ్యయనం చేశారని వెల్లడించారు. ● ఈ సందర్భంగా డాక్టర్‌ విష్ణునందన్‌ మాట్లాడుతూ తమ అధ్యయనంలో సుమారు 32 శాతం మంది వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ అలవాటు వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

– జాతీయ సదస్సులో రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు మెడికల్‌ కాలేజీ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు జాతీయ సదస్సులో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడం విశేషం. డాక్టర్‌ నమ్రితా ఓరల్‌ ప్రెజెంటేషన్‌లో ప్రథమ బహుమతి సాధించగా, డాక్టర్‌ వీణ ప్రియా పోస్టర్‌ ప్రెజెంటేషన్‌లో మొదటి స్థానం దక్కించుకుని కాలేజీకి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి మంగళవారం విజేతలను అభినందించారు.

కార్యక్రమంలో అడ్మిన్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవి, ప్రొఫెసర్‌ – ఇన్‌చార్జ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ పూర్ణమ్మ, ఇతర అధ్యాపకులు, సహాయ ఆచార్యులు, పీజీ వైద్యులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement