రేపు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు | Ugadi Celebrations At The Ysrcp Central Office On March 19 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Mar 18 2026 5:05 PM | Updated on Mar 18 2026 5:31 PM

Ugadi Celebrations At The Ysrcp Central Office On March 19

సాక్షి, తాడేపల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు(మార్చి 19, గురువారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలన్నారు.

‘‘సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Advertisement
 
Advertisement
Advertisement