గుండె ధైర్యం.. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌ : వైఎస్‌ జగన్‌ | Updates: YSRCP Chief YS Jagan Mohan Reddy meets Ongole Assembly cadre | Sakshi
Sakshi News home page

గుండె ధైర్యం.. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌ : వైఎస్‌ జగన్‌

Mar 17 2026 12:02 PM | Updated on Mar 17 2026 3:17 PM

Updates: YSRCP Chief YS Jagan Mohan Reddy meets Ongole Assembly cadre

సాక్షి,తాడేపల్లి : గుండె ధైర్యం.. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్‌తో వైఎస్‌ జగన్‌  భేటీ అయ్యారు. వైఎస్ జగన్ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ జగన్‌ది మాత్రమే కాదు.. వైఎస్సార్‌సీపీ అంతా కలిసి కట్టుగా నిర్మించుకున్నాం. వైఎస్సార్‌సీపీ విలువలు,విశ్వసనీయత మీద పుట్టింది. అదే పునాదుల మీద కొనసాగుతోంది. గుండె ధైర్యం.. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌,మనం మంచి చేశాం. కాబట్టే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నాం. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారు. ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. 

అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు బాబు బిల్డప్‌. వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి అప్పగించారు. కేవలంలో ఖజానాలో రూ.100కోట్లు మాత్రమే ఉంచారు. తర్వాత కోవిడ్‌ లాంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా ఒత్తిళ్ల మధ్య మన పరిపాలన సాగింది. ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశాం. ముందుగానే క్యాలండర్‌ ఇచ్చి హామీలను అమలు చేశాం. బడ్జెట్‌లో క్యాలెండర్‌ పెట్టి పథకాలు అమలు చేశాం. 

పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. మన హయాంలో రూ.3.31లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.2.7లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశాం. రెండేళ్లకే చంద్రబాబు కమిటెడ్‌ అప్పులు.. గ్రాస్‌ అప్పులు రెండేళ్లకే రూ.3.30లక్షల కోట్లు దాటాయి. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపాయాయి’అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

’మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లిపోయాయి. జగన్‌ ఏం చేయగలిగాడు. బాబు ఎందుకు  చేయలేకపోతున్నాడని చర్చిస్తున్నారు. అవినీతికి తావు లేకుండా మనం పథకాలు అమలు చేశాం. ఇప్పుడు దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే కొనసాగుతుంది.  

రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి. భూములను శెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ పట్టుబడ్డారు. పార్లమెంటు చరిత్రలో డ‍్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణం. 

చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించడం లేదు. మోసం చేశారని బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేస్తామంటున్నారు. ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్‌పై వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై నో యాక్షన్‌. మహిళలకు అశ్లీల వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మీద నో యాక్షన్‌. 

చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్‌. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ మీద కూడా నో యాక్షన్‌. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా నో యాక్షన్‌. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్‌తో పట్టుబడితే నో యాక్షన్‌. తన కొడుకు స్విమ్మింగ్‌​ పూల్స్‌​ వద్ద తాగుతు, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌ చేస్తే నో యాక్షన్‌.

తన బావమరిది మహిళలపై నీచంగా మాట్లాడితే నో యాక్షన్‌. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని బాబు అన్నారు. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్‌ సెట్‌ లేదు. చంద్రబాబుకు ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్‌ 220లో కార్యకర్తలకు పెద్దపీట. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి’ అని అన్నారు. 

కూటమి నేతల నీచపు పనులపై YS జగన్ సంచలన రియాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement