శ్రీరామ పట్టాభిషేక అలంకారం | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ పట్టాభిషేక అలంకారం

Mar 18 2026 11:11 AM | Updated on Mar 18 2026 11:11 AM

మంగళగిరి టౌన్‌ : మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు భక్తులకు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కారుమంచి మురళీసాయి, సోదరులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన యేనుగ కిషోర్‌ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

నేడు గోవాడలో కోటి కుంకుమార్చన

అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్‌ పావులూరి రమేష్‌, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్‌ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్‌ శర్మ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్‌

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్‌ఐ అపర్ణ సీజ్‌ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం

తెనాలిఅర్బన్‌: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్‌ కంపోస్టు, కోకో పిట్‌ కేంద్రాన్ని, ఎస్‌టీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.ఆర్‌.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్‌, ఏఈ సునీల్‌, పంచాయతీ రాజ్‌ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement