గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 15 2026 5:08 AM | Updated on Mar 15 2026 5:08 AM

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్‌ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.25 5.01 గుంటూరు 6.23 4.59 బాపట్ల 6.23 4.59

2016లో టీడీపీ పాలనలో ...

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం వివరాలు

ఘనంగా విగ్రహ ప్రతిష్ట

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

గుంటూరులో ట్రాఫిక్‌ నిలిపివేసి చేపట్టిన చెట్ల నరికివేత పనులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: టీడీపీ పాలనలో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతోంది. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లు నిలువునా నరికివేతకు గురవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా పచ్చదనం కనుమరుగైపోతోంది. గుంటూరు లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు పొడవునా కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికివేస్తున్నారు.

● లక్ష్మీపురం మెయిరోడ్డు ముఖద్వారమైన మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి స్తంభాలగరువు వరకు కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన నగరపాలక సంస్థ అధికారులు మొదటి దశలో హాలీవుడ్‌ థియేటర్‌ నుంచి బేకర్స్‌ ఫన్‌ వరకు చెట్లను తొలగించారు.

● ప్రస్తుతం రెండో దశలో బేకర్స్‌ ఫన్‌ నుంచి శనివారం ఉదయం చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల ఎదుట నిర్మించిన మెట్లు, ర్యాంపులను తొలగించిన అధికారులు కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని భారీ వృక్షాలను వేళ్లతో పెకిలించి వేస్తున్నారు.

● వాస్తవానికి వాణిజ్య సముదాయాల ముందు మెట్లు, ర్యాంపులను తొలగించి, కాలువలు నిర్మించేందుకు అవకాశం ఉన్నా చెట్లను సైతం నరికి, వేర్లతో పెకిలించి వేయడం గమనార్హం.

● ఒక వైపు వేసవి మొదలై ఎండల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో రోడ్డు పక్కన చెట్లను నరికివేయడం వల్ల మండు టెండల్లో నీడ కరువై అల్లాడాల్సిన దుస్థితి ఎదురుకానుంది.

● మొక్కలను పెంచి, చెట్లను సంరక్షించాల్సిన అధికారులే ఈ విధంగా చెట్లను నిలువునా నరికి వేస్తుండటంతో పర్యావరణ వేత్తలు, నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

7

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. 2016లో సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వస్తున్నారని, కొరిటెపాడు నుంచి గుజ్జనగుండ్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అప్పట్లో ఫుట్‌పాత్‌ల నిర్మాణం కోసమే వందలాది చెట్లను నరికివేశారు. మళ్లీ టీడీపీ అధికారంలో ఉండగా, చెట్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ నిలిపివేసి, చెట్లను నరికివేత పనులు చేపట్టారు. చెట్లతో నిండి పచ్చదనం పంచుతున్న లక్ష్మీపురం ప్రధాన రహదారి చెట్ల నరికివేతతో వెలవెలబోతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశ య నీటిమట్టం శనివారం 537.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

గొరిగపూడి(భట్టిప్రోలు):గొరిగపూడి పంచాయ తీ వరికూటివారిపాలెంలో శనివారం సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement