‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’ | Ambati Rambabu Fires On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’

Mar 18 2026 3:40 PM | Updated on Mar 18 2026 8:24 PM

Ambati Rambabu Fires On Chandrababu And Lokesh

సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.

‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్‌జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత  జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్‌ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు

‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు.

..మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే.

..రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’  అని అంబటి రాంబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement