టీటీడీ చైర్మన్‌ను తొలగించండి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ను తొలగించండి

Mar 18 2026 11:11 AM | Updated on Mar 18 2026 11:11 AM

● తిరుపతిలో మహిళల అరెస్ట్‌ అప్రజాస్వామికం ● గుంటూరు నగరంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల నిరసన ● బీఆర్‌ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్‌ ● అంబటి రాంబాబుతోపాటు పార్టీ నగర అధ్యక్షులు షేక్‌ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబులు కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ● అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లుగా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే అవాస్తలను ప్రచారం చేసి, దానికి వైఎస్సార్‌ సీపీ వారిని బాధ్యులను చేసే కుట్రలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరదీశారన్నారు. కలియుగ దేవుడి జోలికి వెళ్లిన ప్రతి ఒక్కరి పాపం పండిందన్నారు. ఎన్నికల్లో తన చానల్‌ టీవీ–5తో ఊడిగం చేశాడు కాబట్టే.. బీఆర్‌ నాయుడుకు చైర్మన్‌ పదవి ఇచ్చారని, అంతే తప్ప ఆయనేమి భక్తుడు కాదని స్పష్టం చేశారు. బీఆర్‌ నాయుడు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన పరిస్థితుల్లో తొలుత మార్ఫింగ్‌ అన్న ఆయన, తరువాత తప్పేంటి అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. బీఆర్‌ నాయుడుకి బుద్ధి లేకపోయినా చంద్రబాబుకు ఉండాలని, ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. చంద్రబాబు, బీఆర్‌ నాయుడుకు దేవుడు అంటే భక్తి, భయం రెండూ లేవని తెలిపారు. తిరుమల పవిత్రతను దిగజార్చేలా చంద్రబాబు, బీఆర్‌ నాయుడు వ్యవహరించారని ధ్వజమెత్తారు. తిరుపతిలో మహిళలపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ● కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యురాలు నల్లమోతు రూత్‌రాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డొక్కుమళ్ళ రవికుమార్‌, కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈమని రాఘవరెడ్డి, నందేటి రాజేష్‌, బైరెడ్డి రవీంద్రారెడ్డి, తాడిబోయిన వేణుగోపాల్‌, సింగు నరసింహారావు, సీహెచ్‌ వినోద్‌, సూరగాని వెంకటరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌, కీసరి సుబ్బులు, మేడా మురళీ, పల్లపు మహేష్‌బాబు, గనిక ఝాన్సీ, వేలూరి అనిల్‌రెడ్డి, యర్రెడ్ల వెంకటేష్‌రెడ్డి, యాదాల చిన్న, ఓర్సు శ్రీనివాసరావు, షరీఫుద్దీన్‌, అంకాలరాజు, వెంకాయమ్మ, షేక్‌ రబ్బాని, సోమి కమల్‌, పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు సర్కారు తీరుపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): అప్రజాస్వామికంగా, అత్యంత పాశవికంగా తిరుపతిలో మహిళలను అరెస్ట్‌ చేసి, వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement