యడ్లపాడులో జాతీయస్థాయి నాటిక పోటీలు ● తొలిరోజు ఏప్రిల్ 3న వీరన్నపాలెం కళానికేతన్ వారి ‘దీపం కింద చీకటి’, విశాఖ చైతన్య కళా స్రవంతి వారి ‘(అ) సత్యం’, కాకినాడ బీవీకే క్రియేషనన్స్ సమర్పించే ‘కన్నీటికి విలువెంత’ నాటికలు ప్రదర్శిస్తారు.
● రెండో రోజు హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్‌న్స్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’, స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి ‘సీ్త్ర మాత్రే నమః’, గుంటూరు శ్రీరమణ కళానిలయం వారి ‘మాతృత్వం’ నాటికలు ప్రదర్శితమవుతాయి. ఇదే రోజున స్థానిక యడ్లపాడు మానవతా సాగరి బృందం ‘మంచివారే..కాని’ అనే ప్రత్యేక హాస్య నాటికతో ప్రేక్షకులను నవ్వుల పువ్వుల్లో ముంచెత్తనున్నారు. చివరి రోజు విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’, కట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారి ‘మంచి మనసులు’, విశాఖ తెలుగు కళాసమితి వారి ‘చిటికేన వేలు’ నాటికలతో ఈ మహా ప్రదర్శన ముగియనుంది.
● కేవలం కళా విందే కాకుండా, ప్రేక్షకులకు అపురూపమైన ఆతిథ్యాన్ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు అల్పాహారం అందించడంతో పాటు, ఎంట్రీ కూపన్లపై లక్కీ డ్రా నిర్వహించి రోజుకు 40 మంది చొప్పున, మూడు రోజుల్లో మొత్తం 120 మంది విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
మూడు గ్యాస్ సిలిండర్లు సీజ్
యడ్లపాడు: కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళానిలయం, తెలుగు నాటక కళా పరిషత్తుల సంఘం వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ కళాజాతరకు యడ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణం వేదిక అవుతుందన్నారు. ప్రతిరోజు మూడు చొప్పున ప్రధాన నాటికలతో పాటు ఒక ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను అలరించనున్నాయని వెల్లడించారు.
యడ్లపాడు: మండల పరిధిలోని బోయపాలెంలో విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉన్నవ గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న విశ్వథన్ హోటల్‌పై మంగళవారం అధికారుల బృందం ఈ దాడులు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి, వాటిని సీజ్ చేసి, యడ్లపాడులోని వీణా గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. హోటల్ యాజమాన్యంపై స్థానిక తహసీల్దార్ 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో యడ్లపాడు మండల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, రెవెన్యూ ఇన్‌న్‌స్పెక్టర్ సుబ్బారావు, ఉన్నవ గ్రామ వీఆర్వో జగన్‌మోహనరావు, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.