కొరిటెపాడు(గుంటూరు): ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈ మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం అమరావతి జోన్‌కు సంబంధించి జేకేసీ కళాశాల రోడ్‌లోని ఆ బ్యాంక్ జోనల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 జోన్లు, మూడు ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ బ్రాంచ్‌లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా రూ.1,422 కోట్ల రుణాలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బ్యాంక్ తిరుపతి జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం సహా, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణేష్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్ కేంద్రిత రుణ సేవల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు బ్యాంక్ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఉత్పత్తులను ప్రత్యేక స్టాళ్లలో ప్రదర్శించారు. అమరావతి జోనల్ మేనేజర్ ఎన్.గౌరి శంకర్ రావు, విజయవాడ జోనల్ మేనేజర్ ముచ్చినా రాజేష్, రాజమండ్రి జోనల్ మేనేజర్ కత్తుల రాజ్ కుమార్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ పి.అవధేష్ కుమార్, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు.


