జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి 238 అర్జీలు స్వీకరణ
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం వేగవంతంగా చేయాలని డీఆర్వో షేఖ్ ఖాజావలి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ అధికారులకు అందిన అర్జీలపై అవగాహన ఉండాలన్నారు. పరిష్కారానికి వీలుకాని అర్జీల గురించి అర్జీదారులకు వివరించి చెప్పాలన్నారు. అనంతరం వచ్చిన 238 అర్జీలను డీఆర్వో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులు పరిశీలించారు.


