గుంటూరు వెస్ట్: ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక లాలుపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేయడంతోపాటు కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో నూరు శాతం అక్షరాస్యత సాధించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు జిల్లాలో 90,426 మంది అభ్యర్థులు 1485 కేంద్రాల్లో హాజరయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించారు. కార్యక్రమంలో వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు.


