చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

చిత్త

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

● శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు ● లింగోద్భవానికి భారీగా తరలివచ్చిన జనం ● వీఐపీల సేవలో ఆలయ సిబ్బంది ● గంటలతరబడి క్యూలోనే వృద్ధులు, చంటిబిడ్డ తల్లులు

● శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు ● లింగోద్భవానికి భారీగా తరలివచ్చిన జనం ● వీఐపీల సేవలో ఆలయ సిబ్బంది ● గంటలతరబడి క్యూలోనే వృద్ధులు, చంటిబిడ్డ తల్లులు

ఆ‘నంది’ంచెన్‌!

ఆదివారం రాత్రి స్వయంభు వాయులింగ స్వరూపుడైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారు నంది వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబిక పరాక్రమాలకు ప్రతీక అయిన సింహ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ కొట్టే సాయిప్రసాద్‌, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి: మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవార్లకు ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతోపాటు ఉచ్ఛికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. ఆదివారం మొత్తం 9 అభిషేకాలు జరిగాయి. సుప్రభాత సేవ తరువాత సర్వదర్శనానికి 3 గంటలకు అనుమతించారు. రుద్రాభిషేకంతో పాటు క్షీరాభిషేకం పచ్చ కర్పూరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు.

పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగింది. వేకువజాము 2 గంటల నుంచే స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాజగోపురం సమీపం నుంచి సామాన్య భక్తుల కోసం ఉచిత దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల మహాలఘుదర్శనం కల్పించారు. ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు స్పటిక లింగం పక్క నుంచి భక్తులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇంద్రునిపై ముక్కంటీశుని రాజసం

ఉదయం స్వామివారు ఇంద్ర విమానంపై పురవీధుల్లో ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంపై అధిష్టించి అనుసరించారు.

నేడు రథోత్సవం, తెప్పోత్సవం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి నారద పుష్కరిణిలో శివపార్వతులు తెప్పలపై విహరించనున్నారు.

శివరాత్రికి పటిష్ట భద్రత

తిరుపతి అర్బన్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శివాలయాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధానంగా జిల్లాలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టడంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయని వెల్లడించారు. ప్రధాన ఆలయాలు, జలపాతాల వద్ద ప్రత్యేక పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిత్యం నిఘా పెట్టామని ఆయన వివరించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆదివారం ఏకువ జాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. చిట్టమూరు మండలం, ఓగిలి గొల్లపల్లి చెందిన మణెమ్మ(45) ఆలయ మొదటి గేటు సమీపంలో సొమ్మసిల్లిపడిపోయింది. ఆస్పత్రికి తరలించేలోపే అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుడిమల్లం, తలకోన సిద్ధేశ్వరాలయం, సురుటుపల్లి, మొగిలీశ్వరాలయం, పల్లికొండేశ్వరాలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. జనజాగరణ చేసి జంగమయ్యను దర్శించి పునీతులయ్యారు.

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు 1
1/3

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు 2
2/3

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు 3
3/3

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement