చరమగీతం
హామీలకు
జిల్లా సమాచారం
అమలు చేయని ఎదురు చూస్తున్న
పథకాలు లబ్ధిదారులు(లక్షల్లో)
ఆడబిడ్డనిధి 5.02
50ఏళ్లకే పింఛన్ 2.32
నిరుద్యోగ భృతి 7.16
సున్నా వడ్డీ 6,03
తిరుపతి సిటీ: ఎన్నికల సమయం ఆసన్నమైతే చాలు చంద్రబాబు టార్గెట్ మహిళలు, సామాన్య పేదలు. వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టుకుని అధికారం చేపట్టేందుకు అమలుకు సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టడం ఆయన నైజం. ఇదే నేడు రిపీట్ అవుతోంది. 2024 ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ పథకాలంటూ ఊరువాడా తిరిగి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని అధికారం చేపట్టారు. సూపర్‌సిక్స్ హామీల ఇప్పటివరకు అమలు చేసిన వాటిలోనూ కనీసం జిల్లాలో అర్హులైన 30 శాతం మంది కూడా లబ్ధి పొందలేదు. ప్రధానంగా మహాశక్తి ఆడబిడ్డనిధి పథకం కింద మహిళలకు నెలకు రూ.1500, జిల్లాలో ని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, మహిళా సంఘాలకు సున్నా వడ్డీ, 50 ఏళ్లకే పింఛన్లు వంటి హామీలకు చరమగీతం పాడేశారు. వీటిపై కనీసం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మంగళం పాడేశామని సంకేతాలు ఇచ్చేశారు. బాబు బడ్జెట్ తీరుపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.


