నమ్మక ద్రోహం
మూడోసారి విడుదల చేసిన బడ్జెట్‌లో కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల భృతి ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం ఒక్కమాట కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదు. ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన నిరుద్యోగులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోష్ట తగలకతప్పదు. – శోభన్‌యాదవ్, వరదయ్యపాళెం మండలం
ఊసెత్తని సున్నా వడ్డీ
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ గురించి కనీసం మాట్లాడడం లేదు. మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూసిన సున్నా వడ్డీ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దీనిపై డ్వాక్రా మహిళలకు సంతృప్తిని మిగిల్చింది. ఎన్నికల సమయంలో మహిళలను ఊరడించే విధంగా ఉచిత హామీలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సున్నా వడ్డీ గురించి కనీసం నోరు మెదపడంలేదు. మహిళల పట్ల వారి నిర్లక్ష్య వైఖరి బయటపడింది. గత ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరుతో చెప్పిన సమయానికి వారి ఖాతాల్లో జమ అయ్యాయి. – శ్యామలమ్మ, వైస్ ఎంపపీ, వరదయ్యపాళెం మండలం
ఎంతో ఆశతో ఎదురు చూశాం..
ఆడ్డబిడ్డ నిధికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశాం. కానీ బడ్జెట్ నిరాశపరచింది. కనీసం మహాశక్తి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే మాట కూడా ఎత్తలేదు. దీంతో ఇక మహిళా శక్తికి మంగళం పాడేసినట్టే తెలుస్తోంది. జిల్లాలో మహిళలు చంద్రబాబు హామిని నమ్మి ఓట్లు వేశారు. నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళకు అందుతుందని ఆశపడ్డారు. ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదు. మా ఇంటిలో నాతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండేళ్లకు ముగ్గురికి ఇప్పటి వరకు లక్షా ఎనిమిది వేలు రావాల్సి ఉంది. అంతా మాయగా అనిపిస్తోంది. – రాజేశ్వరి, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి
నమ్మక ద్రోహం
నమ్మక ద్రోహం


