హామీల ప్రస్తావనేది..!
కూటమి నేతలు ఇచ్చిన హా మీల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం దారుణం. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదు. బడ్జెట్ పూర్తిగా రాజకీయ తంత్రంగా ఉంది. మహిళలు, మైనారిటీలు, బడుగుబలహీన వర్గాల సంక్షేమం బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. విద్యా, ఆర్యోగంపై తూతూమంత్రంగా అంకెల గారడిని చూపించారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై స్పష్టత లేదు. ప్రపంచబ్యాంక్ అప్పుల కోసం తయారు చేసిన బడ్జెట్‌గా పరిగణించవచ్చు.
–వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి


