ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ | - | Sakshi
Sakshi News home page

ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ

Feb 15 2026 12:38 PM | Updated on Feb 15 2026 12:38 PM

ఆవును

ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ

నాగలాపురం: ఆవును లారీ ఢీకొన్న ఘటన మండలంలోని చిన్నాపట్టులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుత్తూరు నుంచి ఓ లారీ ఊత్తుకోటై వైపుగా తమిళనాడుకు బయలుదేరింది. మార్గ మధ్యంలో నాగలాపురం మండలంలోని చిన్నాపట్టు గ్రామం మలుపు వద్ద రోడ్డుపై వెళుతున్న ఆవును ఢీకొనడంతో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. చూడి ఆవు కావడంతో లారీ ఢీకొన్న వెంటనే కడుపులో ఉన్న దూడ వెలుపలకి వచ్చి, పడి అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ మధ్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం గాయపడిన లారీ డ్రైవర్‌ను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి, అతడిపై డ్రంక్‌అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల తెలిపారు.

ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ1
1/1

ఆవును ఢీకొని బోల్తా పడిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement