ఎంతో నమ్మకంతో ఓటు వేశాం
మా ఇంట్లో 18 ఏళ్లు నిండిన మహిళలం ముగ్గురు ఉన్నాం. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సీఎం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. దీంతో నమ్మి ఓటు వేశాం. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రెండేళ్లు గడిచింది. మా కుటుంబంలో ముగ్గురికి కలిపి రెండేళ్లకు రూ.1.08లక్షలు రావాల్సిఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అని ఎదురు చూస్తున్నాం.
– సావిత్రి, దినసరి కూలీ, తిరుపతి రూరల్
●


