ఆడబిడ్డ నిధి ప్రకటించాల్సిందే
ఆడబిడ్డ నిధిపై తక్షణం చంద్రబాబు సర్కార్ ఈ అసెంబ్లీలో ప్రకటించాల్సిందే. రెండేళ్లు గడుస్తున్నా పథకాన్ని అమలు చేయకుండా పేద మహిళలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఇంట్లో మహిళ ఈ పథకం అమలు చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం మహిళల ఆశలపై నీళ్లు చల్లేసినట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఏ ప్రభుత్వమైన మనుగడ సాగించడం కష్టమే. – పవిత్ర,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి
●


