ఏం చేద్దాం..! | - | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం..!

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

ఏం చే

ఏం చేద్దాం..!

23వ తేదీ నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు

13వ తేదీన హాల్‌టికెట్ల విడుదల

ఫీజు పెండింగ్‌ ఉంటే హాల్‌టికెట్లు ఇవ్వరా?

విద్యార్థుల్లో ఆందోళన

ఇంటర్‌ పరీక్షలు ముంచుకొస్తున్నాయ్‌..ఉత్తీర్ణత సాధిస్తే తొలి అడుగు ముందుకు పడుతుంది.. అయితే ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలలు ఫీజు బకాయి ఉన్న విద్యార్థులకు హాల్‌టికెట్‌ ఇవ్వబోమని బెదిరిస్తున్నాయి.. ఈ పరీక్షలు దాటితే.. విద్యార్థి జీవితం కీలక మలుపు తిరుగుతుంది.. అయితే ఫీజు బకాయి అడ్డంకిగా మారుతుందేమోనని విద్యార్థుల్లో ఆందోళన.. అలజడి మొదలైంది. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు.

తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు స మయం ఆసన్నమైంది. ఈనెల 23వ తేదీ నుంచి పరీక్ష లు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేటు, కార్పొ రేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకా యి ఉన్న వారికి హాల్‌టికెట్లు ఇవ్వరేమో? అంటూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీనికితోడు కొన్ని కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజు బకాయిలున్న విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యా లు పెండింగ్‌ ఫీజులు వెంటనే చెల్లించాలని. లేనిపక్షంలో హాల్‌టికెట్‌ రాదనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసైనా ఫీజు చె ల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా జిల్లాలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు సరిపడా ఇన్విజిలేటర్ల కొరతను అధికమించేందుకు కసరత్తు చేస్తున్నారు.

వేధిస్తున్న ఇన్విజిలేటర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల కోసం 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి సుమారు 12 నుంచి 14 మంది ఇన్విజిలేటర్లు అవసరం ఉంది. వీరితో పాటు పరీక్ష కేంద్రాలపై పూర్తిస్థాయి నిఘా ఉంచేందుకు ఆర్‌ఐఓతోపాటు హైపవర్‌ కమిటీ, ఫ్లయింగ్‌, సిటింగ్‌ స్క్వాడ్‌లు నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో అందుకు సరిపడా ఇన్విజిలేటర్లు లేకపోవడంతో అధికారులు మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్‌కు సమస్యను విన్నవించడంతో హైస్కూల్‌ ప్లస్‌ టీచర్లును ఇన్విజిలేటర్లుగా నియమించుకోవాలన్నా రు. దీంతో ఇంటర్‌ పరీక్షలకు ఇక హైస్కూల్‌ టీచర్లు ఇన్విజిలేటర్లుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన టీచర్లుకు సమాచారం అందించారు.

జిల్లా సమాచారం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 72

ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు 109

జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు 84

జూనియర్‌ ఇంటర్‌ పరీక్షకు

హాజరు కానున్న విద్యార్థులు 30,319

సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు

హాజరుకానున్న వారు 30,272

పరీక్ష కేంద్రాలకు అవసరమైన

ఇన్విజిలేటర్లు 1,176

ఇన్విజిలేటర్ల కొరత

సుమారు 350 మంది వరకు

హాల్‌టికెట్లు అందరికీ అందేనా?

23 నుంచి పరీక్షలు

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 60 వేల మందికి పైగా ఇంటర్‌ ఫస్ట్‌, సెంకడ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు 13 తేదీ నుంచి హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెబ్‌సైట్‌లో విడుదల చే శారు. దీంతో విద్యార్థులు హాల్‌టికెట్లను నేరుగా వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, కళాశాల యా జమాన్యాలతో ఎటువంటి అవసరం ఉండ దని అధికారులు చెబుతున్నారు. ఫీజు బకాయిలున్న విద్యార్థుల విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఫీజు కోసం విద్యార్థులను పీడిస్తూ హాల్‌టికెట్లను నిలపుదల చేస్తే కళాశాల గుర్తింపును రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

హాల్‌టికెట్లపై ఆందోళన అనవసరం

ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్‌టికెట్ల విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కళాశాలలతో సంబంధం లేకుండా నేరుగా వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థి తన వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫీజులకు హాల్‌టికెట్‌కు లింక్‌పెట్టి వేధించే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పకడ్బందీగా నిర్విహిస్తున్నాం. ఇన్విజిలేటర్ల కొరతను అధికమించేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు హైస్కూల్‌ ప్లస్‌ టీచర్లు నియమించేందుకు కసరత్తు చేస్తున్నాం. – జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి జిల్లా

ఏం చేద్దాం..!1
1/2

ఏం చేద్దాం..!

ఏం చేద్దాం..!2
2/2

ఏం చేద్దాం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement