బాబు పాపాలు బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

బాబు పాపాలు బట్టబయలు

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

బాబు

బాబు పాపాలు బట్టబయలు

రైల్వేకోడూరు అర్బన్‌ : వేంకటేశ్వరసామి కళ్లు తెరిచాడని, సీఎం చంద్రబాబు పాపాలు బట్ట బయలయ్యాయని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో పవిత్రమైన సనాతన ధర్మం పేరు చెపుకుంటూ రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఈ భూ మండలంలోనే లేడన్నారు. 2014 నుంచి, 2019 వరకు తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలు చంద్రబాబువేనని తెలిపారు. హెరిటేజ్‌ విషయం బటపడకుండా మరో పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి టెండర్‌ దక్కించుకుని నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. హెరిటజ్‌ సంస్థల్లో రూ.600కు అమ్ముతూ తిరుమల మహా ప్రసాదానికి ఎలా సరఫరా చేసారో చంద్రబాబే చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం హిదువుల మనోభావాలను రాజకీయాలకు వాడుకోవడం మానేయాలన్నారు.

అడవి పంది దాడిలో

ఒకరికి గాయాలు

చిట్వేలి: మైలపల్లి రాచపల్లిలో శుక్రవారం ఉదయం చొక్కారాజు రవీంద్రరాజు తన పొలంలో బొప్పాయి చెట్లు తవ్వుతుండగా అకస్మాత్తుగా అడవిపంది అతనిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు గాయపడిన రవీంద్రరాజును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం రాజంపేటకు తరలించారు.

బాబు పాపాలు బట్టబయలు 1
1/1

బాబు పాపాలు బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement