విద్యను దూరం చేశారు
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి, నాడు–నేడు పనులకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు సీబీఎస్‌ఈ, టో ఫెల్, ఐబీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యను తొలగిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం బాధాకరం. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు నిధులు పూర్తి స్తాయిలో కేటాయించలేదు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారు. ప్రాజెక్టులకు అరకొర కేటాయించారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది.
–యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుపతి


