బంగారం స్వాధీనం
రైల్వేకోడూరు: చోరీ కేసులో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీకి చెందిన దాసరి దేవిక అనే మహిళ మెడలోని బంగారు సరుడును తిరుపతి జిల్లా సంజయ్ గాంధీనగర్‌కు చెందిన గుంజు ప్రకాష్ (30) అనే వ్యక్తి 2024, జూలై 11వ తేదీన అపహరించి పారిపోయాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ప్రసాద్ రెడ్డి సహకారంతో ఎట్టకేలకు శనివారం 29 గ్రాముల బంగారు సరుడు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
యువతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరం: ఏఐపీఎస్‌ఎన్
తిరుపతి కల్చరల్: యువతకు శాసీ్త్రయ ఆలోచన, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరమని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్(ఏఐపీఎస్‌ఎన్) ప్రధాన కార్యదర్శి ఆశామిశ్రా తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల ఏఐపీఎస్‌ఎన్ దక్షిణాది రాష్ట్రాల యూత్ వర్క్‌షాప్ తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆశామిశ్రా ప్రసంగించారు. ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌లో జరిగే క్రైసిస్ ఆన్ యూత్ ప్లీనరీలో యూత్ ట్రెండ్స్ అండ్ యాక్టివిజం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఆన్ ఎంప్లాయిమెంట్ యంగ్ వర్కర్స్ సమస్యలు, ఎటాక్ ఆన్ సైన్స్ అండ్ రేషనల్ థింకింగ్‌పై సెక్షన్ల వారీకి సమావేశాలు ఉంటాయని ఏఐపీఎస్‌ఎన్ సదరన్ రీజియన్ కన్వీనర్ వి.గోపినాథ్ పేర్కొన్నారు.


