సర్వేజన..
అభివృద్ధికి ఆమడ దూరం...సంక్షేమానికి టోకరా...!
నిరుద్యోగభృతి, ఆడబిడ్డనిధి ఊసేలేదు
జిల్లాలో తాగు, సాగునీటికి మొండి చెయ్యి
రైతుకు రిక్తహస్తం గ్రేటర్‌కు తిరునామం
తిరుపతి సిటీ: షరామమూలే..భారీ అప్పుల అంచనాతో బాబు సర్కార్ బడ్జెట్ తృతీయ పర్వం కొనసాగింది. అభివృద్ధికి ఆమడ దూరంగా.. సంక్షేమానికి టోకరా పెడుతూ అంకెల గారిడీతో ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి పయ్యావుల కే శవ్ అసెంబ్లీలో చదివి వినిపించారు. తిరుపతి జిల్లాకు తిరునామం పెడుతూ ఏ రంగంలోనూ బడ్జెట్ గణాంకాల్లో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మేధావులు, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
కోతలేనా.. కేశవా..!


