రైతుకు రిక్తహస్తం
బడ్జెట్‌పై ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి నిరాశ మిగిలింది. గిట్టుబాటు ధరలేక ఎదురుచూస్తున్న రైతును బడ్జెట్ నిండా ముంచింది. కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మిగిలిపోయింది. జిల్లాలో వరి, వేరుశనగ, నిమ్మ, మామిడి రైతు పరిస్థితి దయనీయం. వారిని బడ్జెట్ ఆదుకుంటుందనే నమ్మకం పోయింది. పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణం. – దాసరి జనార్దన్,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సత్యవేడు
జాబ్ క్యాలెండర్ ఊసేలేదు
బాబు సర్కార్ ప్రగల్భాలు పలికిన నిరుద్యోగ భృతి మాటే బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. కనీసం జాబ్‌క్యాలెండర్‌పైనా ప్రకటన చేయలేదు. నెలకు ప్రతి నిరుద్యోగికి రూ.3వేలు కేటాయిస్తామని మోస పూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న యువగళం పాదయాత్ర హామీ ఏమైంది. బడ్జెట్‌లో కనీసం జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు, ఉన్న సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణం.
–ప్రసాద్‌రెడ్డి, ఏమ్‌ఏ పీహెచ్‌డీ,
నిరుద్యోగి, తిరుపతి రూరల్
ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ
బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది. ప్రధానంగా 12వ పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం బాధాకరం, అలాగే మంత్రి ఉద్యోగుల సంక్షేమంపై మాట్లాడిన సందర్భంలో డీఏ, ఐఆర్ అంశాలను ఎత్తకపోవడం సరికాదని భావిస్తున్నాం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలపై మాట్లాడుతారని ఆశగా ఉన్నాం. అయితే ఆ ఊసే ఎత్తలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు.
–కే. ముత్యాలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి,
యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం
మహిళలకు శఠగోపం
జిల్లాలో సుమారు 2 లక్షల మంది తల్లికి వందనం పథకానికి అర్హులు ఉన్నారు. అలానే ఉచిత బస్సుకు అర్హులు 13 లక్షల వరకు ఉన్నారు. కుటుంబంలోని ప్రతి మహిళకు మహాశక్తి పథకానికి సుమారు 9 లక్షల మంది అర్హులు ఉన్నా రు. వారి అందరికీ బాబు సర్కార్ శఠగోపం పెట్టేసింది. తల్లికి వందనానికి కోత విధిస్తూ నిధులు కేటాయించారు. మహిళా శక్తి, ఆడ్డబిడ్డనిధి పథకం మాటవరసకై నా బడ్జెట్‌లో ప్రస్థావించలేకపోవడంతో కూటమి కుట్ర బయటపడింది.
– సంధ్యారాణి,
ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి
●
రైతుకు రిక్తహస్తం
రైతుకు రిక్తహస్తం
రైతుకు రిక్తహస్తం


