బడ్జెట్ అంతా అంకెల గారడీనే
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీనే. ప్రజలను మభ్యపెట్టేందుకు త యారు చేసిన బడ్జెట్. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల ఊసే లేదు. మరో సారి వాటికే కేటాయించారు. దారుణమైన బడ్జెట్‌గా చరిత్రలో నిలచిపోతుంది. నెలవిడిచి సాగుచేసేలా ఈ బడ్జెట్ ఉంది. గత సంవత్సరం గత వార్షిక బడ్జెట్ రూ.2.92 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే ఈసారి రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యశాఖకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని పేర్కొంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు.
– డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం,
ఎమ్మెల్సీ, తిరుపతి
గొప్పల కోసం తిప్పలు
కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఎవరీకి ఉపయోగలేదు. వేతన జీవులకు మొండి చేయి చూపించారు. బడాయి మాటలు, అప్పులు తెచ్చుకునేందుకు స్థూల ఉత్పత్తిని పెంచి చూపడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదు. నిత్యావసరాల పెరుగుదల, పీఆర్సీ ప్రస్తావన, ఉద్యోగులకు 12వ పే రివిజన్ కమిషన్, కార్మికులు ప్రస్తావన, వేతనాల పెరుగుదల ఊసేలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా కల్పించలేదు. నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. బడ్జెట్ ఏ వర్గానికి మేలు చేసేలా లేదు.
– కందారపు మురళి,
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి
బడ్జెట్ అంతా అంకెల గారడీనే


