అనుమానాస్పదస్థితిలో మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో మృతి

Feb 15 2026 12:38 PM | Updated on Feb 15 2026 12:38 PM

అనుమానాస్పదస్థితిలో మృతి

అనుమానాస్పదస్థితిలో మృతి

నారాయణవనం: అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం శనివారం ఉదయం జాతీయ రహదారి పక్కన లభించింది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని జాతీయ రహదారిపై గోవిందప్పనాయుడుకండ్రిగ వద్ద అరుణానది బ్రిడ్జి సమీపంలో శనివారం వేకువ జామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు సమాచారం అందించారు. మృతుని వయసు 60–65 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. పచ్చని, తెలుగు గీతల చొక్కా, నీలి, కాపీ కలర్‌ గీతల లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతుడు 6 అడుగుల ఎత్తు ఉన్నాడని, పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించమన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుని గురించిన వారు 9440900693 నంబర్‌కు సమాచారం తెలపాలని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement