నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకోండి

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకోండి

నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకోండి

తిరుపతి అర్బన్‌: నగరంలోని బాలాజీ నర్సింగ్‌హోమ్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ, ఆర్‌పీఐ, ప్రజా సంఘాలకు చెందిన నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కలిశారు. ఇటీవల నర్సింగ్‌ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటమపై సమగ్రవిచారణ చేపట్టాలని కోరారు. ఓ వైపు ఫీజుల దోపిడీ, మరోవైపు విద్యార్థు లపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోలేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతలు చిన్నం పెంచలయ్య, నదియా, మంజూల,నమతా తదితరులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement