మహిళా ఎమ్మెల్యేలు గళమెత్తాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేలు గళమెత్తాలి

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

మహిళా

మహిళా ఎమ్మెల్యేలు గళమెత్తాలి

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేలా గళమెత్తాలి. అధికార దాహంతో అలివికాని హామీలను గుప్పించి మహిళలను మభ్యపెట్టి అధికారం చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి తీరుతా..ఆడబిడ్డలకు అండగా ఉంటా అని చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చేతులెత్తేసి మా వల్లకాదనడం మోసం. ఈ అసెంబ్లీలో ఆడబిడ్డ నిధిపై ప్రకటన చేసి తీరాల్సిందే. –డాక్టర్‌ సాయిలక్ష్మి,

ఐద్వా, జిల్లా కార్యదర్శి, తిరుపతి

ఆడబిడ్డ నిధికి నిధులు

కేటాయించాలి

బాబు సర్కార్‌ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. బడ్జెట్‌ సమావేశాల్లో తప్పకుండా ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించాల్సిందే. అధికారం కోసం మహిళలను మభ్యపెట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని షరతులు లేకుండా అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలో లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణం పథకాన్ని అమలు చేయాలి. లేదంటే మహిళలోకం తిరగబడే పరిస్థితి ఉంది. – ఆర్‌ ఆషా,

పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి

మహిళా ఎమ్మెల్యేలు  గళమెత్తాలి  
1
1/1

మహిళా ఎమ్మెల్యేలు గళమెత్తాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement