ఇద్దరిపై పీడీ యాక్ట్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అ క్రమ రవాణా కేసుల్లో నిందితులైన కర్ణాటక వాసి సయ్యద్ ఫైరోజ్ అ లియాస్ ఫెరోజ్ ఎలియాస్ సయ్యద్ ఎలియాస్ ఫైరు (38), చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ అలియాస్ రాజాబాబు ఎలియాస్ బూసి (33)పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ ఎర్రచందనం అక్రమ రవా ణా నిరోధించడమే కాకుండా, ఎక్కువ కేసుల్లో అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏ ర్పడి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పీడీ యా క్ట్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు సిఫారసు చేశారు. ఆ మేరకు తిరుపతి కలెక్టర్, వెంకటేశ్వర్ వీరిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమలులో భాగంగా వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
దాడి కేసులో ఆరుగురిపై కేసు
నారాయణవనం: దారికి అడ్డుగా ఆపిన బైక్‌ను తీ యమన్నందుకు దాడి చేసిన కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. కడపకు చెందిన అంకిరెడ్డి మండలంలోని పాలమంగళం దక్షిణపు కండ్రిగలో తన అత్తగారి ఇంటికి వచ్చాడు. శనివా రం ఉదయం తన కుమారునితో కలిసి కారులో ఇంటి నుంచి హైవే రోడ్డుపైకి వచ్చాడు. నైనారుకండ్రిగ దళితవాడకు చెందిన మహేష్ దారికి అ డ్డుగా బైక్ పెట్టుకుని, వాహనంపై కుర్చొని ఫోన్ లో మాట్లాడుతున్నాడు. దారి కోసం అంకిరెడ్డి హా రన్ కొట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఒకరినొకరు చేయి చేసుకున్నారు. దీంతో మహేష్ ఫోన్ చేసి తన అనుచరు లను పిలిపించి అంకిరెడ్డిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్‌తో అతని అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.
ఇద్దరిపై పీడీ యాక్ట్


