ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
న్యూస్‌రీల్
శేషవాహనంపై సోమస్కందుడు, యాళి వాహనంపై జ్ఞానప్రసూనాంబ
శ్రీకాళహస్తి: నాగేంద్రాహారాయ..త్రిలోచనాయ.. అన్న ట్లు నాగేంద్రుని హారంగా చేసుకున్న సర్వేశ్వరుడు నా గరాత్రి పురస్కరించుకుని ఆదిశేషుని పడగల నీడన కొ లువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున నాగరాత్రిగా పిలుస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి సోమస్కందమూర్తి శేషవాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవల్లో కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లు హంస, శుక వాహనాలపై ఊరేగారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి, పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
మహాశివరాత్రి (మాఘ బహుళ త్రయోదశి)
వాహన సేవలు
ఉదయం 10.30గంటలకు:ఇంద్ర విమానం–చప్పర సేవ
ఉభయదాతలు:సి.సత్యనారాయణ, అడ్వకెట్, శ్రీకాళహస్తి
రాత్రి 9.30గంటలకు నంది – సింహ వాహనసేవ
ఉభయధాతలు:దక్షిణ భారతదేవాంగ సంఘం వారిచే పట్టు వస్త్రాలు సమర్పనణ
వెంకటగిరి రాజావారు. వెంకటగిరి, తిరుపతి జిల్లా
కీ.శే.యద్దనపూడి వెంకటసుబ్రహ్మణ్యశర్మ – శ్రీమతి స్వరాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం
కె.దయానందగుప్త, బజారువీధి, శ్రీకాళహస్తి
టి.ఎస్.రామగుప్త, అరుణా మెడికల్స్, శ్రీకాళహస్తి
ఆశల పద్దు నిరాశపరిచింది.. కలల బడ్జెట్ కన్నీళ్లు మిగిల్చింది.. అన్నిరంగాల వారికి మొండి చేయి మిగిలింది.. నిరుద్యోగులకు నిరాశ మిగిల్చింది..సంక్షేమానికి తూట్లు పొడిచింది.. రైతులకు రిక్తహస్తం చూపింది.. పేదల పిల్లలకు విద్యను దూరం చేసింది..రోగ నివారణకు వైద్యం పారనంది.. మొత్తంగా అభివృద్ధికి ఆమడదూరంగా బాబు గొప్పలకు తిప్పలు పడుతూ అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. సర్వజనులు సంక్షేమానికి దూరం అయ్యారని మండిపడుతున్నారు.
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు


