శ్రీసిటీలో స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్
శ్రీసిటీ(వరదయ్యపాళెం): ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తు దేశీయ సామరా్‌థ్య్‌ల బలోపేతం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, విధాన స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పరిశ్రమల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. అతిథికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ మారుతున్న విధానాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమ వర్గాలను చైతన్యవంతులను చేయడానికి సంబంధిత నిపుణులతో తరచూ ఈ తరహా కార్యక్రమాల నిర్వహణ అవసరం అన్నారు. ‘మారుతున్న గ్లోబల్ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై ప్రసంగించిన సుందరం, ప్రధానంగా ప్రపంచ ఆర్థిక పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక బలాలను ప్రస్తావించారు.


