గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

గడ్డి

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

నాగలాపురం: గడ్డిని తరలిస్తుండగా కరెంటు తీగ తగిలి ట్రాక్టర్‌కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మండలంలోని వినోభానగర్‌ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగలాపురం పంచాయతీ, వినోభానగర్‌ గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి పొలంలో ఉన్న 125 గడ్డి చుట్టలను అదే గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి తన సొంత ట్రాక్టర్‌లో లోడ్‌ చేసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో అనుకోకుండా కరెంటు తీగ తగిలి నిప్పు రవ్వలు పడి గడ్డి చుట్టలు మండుకోవడం మొదలైంది. ఇది గమనించిన ట్రాక్టర్‌ యజమాని ట్రాలీని అలాగే వదిలేసి, ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గ్రామస్తులంతా వచ్చేలోపు గడ్డి చుట్టలు పూర్తిగా కాలిపోయాయి.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్‌ నంబరు 89777 16661కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావాలనుకున్న వినియోగదారులు తమ వద్ద విద్యుత్‌ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు.

చెరువులో మునిగి

బీటెక్‌ విద్యార్థి మృతి

పెళ్లకూరు: మహాశివరాత్రి పర్వదినాన బోటు షికారుకు వెళ్లిన తొమ్మిది మంది యువకుల్లో ఓ బీటెక్‌ విద్యార్థి మృతి చెందగా తక్కిన 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం పునబాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణం, కై లాసగిరి కాలనీకి చెందిన సింగపాటి శశిధర్‌(19) చైన్నెలోని వేల్‌టెక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఇంటికి చేరుకున్న శశిధర్‌ స్నేహితులతో కలిసి పునబాక చెరువు వద్దకు చేరుకున్నాడు. చెరువు వద్ద ఉన్న చిన్నపాటి బోటులో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి షికారుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటు తిరగబడింది. దీంతో యువకులంతా ఆర్తనాదాలు చేశారు. అరుపులు, కేకలు విని అక్కడ ఉన్న స్థానికులు 8 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ శశిధర్‌ మాత్రం నీట మునిగి మృతి చెందాడు.మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని నిర్జీవంగా పడివున్న శశిధర్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రుల విన్నపం మేరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం 1
1/1

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement