జీఎస్టీతో పన్ను వ్యవస్థ సరళీకృతం
తిరుపతి రూరల్: జీఎస్టీతో పన్ను వ్యవస్థ సరళీకృతమైందని తిరుపతి సీజీఎస్‌టీ కస్టమ్స్ కమిషనర్ డాక్టర్ సతీష్ ధవలే పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన విభాగం, న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ వుమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ సహకారంతో ఐసీఎస్‌ఎస్‌ఆర్ ఆధ్వర్యంలో ‘‘జీఎస్టీ రేఫామ్స్ ఆన్ ది కన్ఫర్మేషన్ పాటర్న్ అఫ్ ది మిడిల్ అండ్ నియో మిడిల్ క్లాసెస్ విత్ ది జెండర్ ప్రాస్పెక్టీవ్ ’’ అనే అంశంపై శుక్రవారం సావేరి సెమినార్ హాల్‌లో రీజినల్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ పన్ను విధానాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని, జీఎస్టీ 2.0లోని మార్పులతో కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుందన్నారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష మాట్లాడుతూ విధానపరమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, ఆర్థిక పురోభివృద్ధికి అమలు చేసే విధానాలను తెలియపరచడం విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ జి. రమామణి, ఐసీఎంఏఐ చైర్మన్ ఎ.పార్థసారథి, ఆర్థిక నిపుణులు డాక్టర్ డి.కృష్ణమూర్తి, ఎంసీ వెంకటనాథ్, జి. ఇందిరా ప్రియదర్శిని, భాగ్యతేజ పాల్గొన్నారు.


