మోకరిల్లిన వైకల్యం
శ్రీరంగరాజపురం : ఆమె పట్టుదలతో వైకల్యాన్ని జయించారు. విద్యుత్ షాక్‌తో ఒక కాలు, ఒక చేయి పూర్తిగా కాలిపోయాయి. ఆమె శరీరం ఏమాత్రం సహరించుకున్నా ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదువులో రాణించారు. శ్రీరంగరాజపురం మండలం గాండ్లపల్లి గ్రామానికి చెందిన ఎం.దొరస్వామి, ఎం.రత్నమ్మ దంపతుల కుమారై కృష్ణవేణి కృషి ఉంటే ఎదగడానికి అంగవైకల్యం అడ్డు కాలేదని నిరూపించారు. మట్టిలో మాణిక్యంగా ఎదిగి తాజా గ్రూప్–1 ఫలితాల్లో గ్రూప్ వన్ అధికారిగా వాణిజ్య పన్నుల విభాగంలో సహా య కమిషనర్‌గా ఎంపికయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో సివిల్ సప్‌లై కమిషనర్‌గా ఎంపికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం
శ్రీ రంగరాజపుర మండలంలోని వడ్డి కండ్రిగలో ఎం.దొరస్వామి, ఎం.రత్నమ్మ దంపతులకు కృష్ణవేణి 2000లో జనవరి 19న జన్మించారు. ఆమె పదో తరగతి వరకు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 2010లో ఆమె 6వ తరగతి చదవుతున్నప్పుడు విద్యుత్‌షాక్‌కు గురై ఒక కాలు, ఒక చేయి కోల్పోయారు. 10 పరీక్షల్లో మండలానికి మొదటి స్థానం రావడంతో వైఎస్సార్ కడవ జిల్లాలోని ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో సీటు పొందారు. అక్కడ విద్యను పూర్తి చేసి, 2023 లో ఇంటి వద్దనే గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం అయ్యారు. మొదటి ప్రయ త్నం విఫలం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో శిక్షణ పొందారు. తాజాగా నేడు విడుదల చేసిన గ్రూప్–1లో రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగంలో సహాయ కమిషనర్‌గా, అలాగే గ్రూప్స్–2 లో సివిల్ సప్‌లై కమిషనర్‌గా ఉద్యోగాలు సాధించా రు. తన తల్లిదండ్రులు కృషి ప్రోత్సాహంతో నే నేడు గ్రూప్స్‌లోని రెండు ఉద్యోగాలను సాధించినట్లు తెలిపారు.
తండ్రి ఎం.దొరస్వామి
తల్లి ఎం.రత్నమ్మ
అవమానాలకు గురయ్యా..
నేను చదువుకున్న రోజుల్లో సహచర విద్యార్థుల వద్ద, గ్రామంలో అనేక అవమానాలకు గురయ్యా. పాఠశాలకు వెళ్లాలన్నా నడవలేని పరిస్థితి. అందరూ ఇంటిలోనే కూర్చో ఇక ఏం చదువుకుంటావు. అని హేళన చేసేవారు. అవి ఏవీ పట్టించుకోకుండా నా అన్నదమ్ములు, కుటుంబ సహకారంతో ఎక్కడా నిరుత్సాహ పడకుండా చదివాను. ఇంటి వద్దనే నిత్వం సాక్షి పత్రిక , మిగిలిన ఇంగ్లీషు దిన పత్రికలు చదివి అనేక మంది జీవిత చరిత్రలు, భారతీయ రాజకీయాలు, జనరల్ నాలెడ్జ్‌లో పట్టు సాధించా. మా ఉపాధ్యాయులు రఫీ, సేహ్నితురాలు అన్నపూర్ణ, మా వదిన పూర్ణిమ ప్రోత్సాహంతోనే రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. – ఎం.కృష్ణవేణి, గ్రూప్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థిని
మోకరిల్లిన వైకల్యం
మోకరిల్లిన వైకల్యం


