బస్సు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

బస్సు

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

● మహిళ మెడ నుంచి బంగారు గొలుసు అపహరణ

వడమాలపేట (పుత్తూరు): తిరుపతి– చైన్నె జాతీయ రహదారి, పాదిరేడు బైపాస్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణపాలయ్యాడు. వడమాలపేట మండలం, పాదిరేడు గ్రామానికి చెందిన ఎ.గంగయ్య(55) మోటర్‌ సైకిల్‌పై బైపాస్‌ రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నెకి వెళ్తున్న తమిళనాడుకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ హరీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జ్యూస్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తున్నట్టు నటించి..

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గిరింపేటలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద సరోజమ్మ అనే మహిళ చిన్నపాటి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి హెల్మెట్లు వేసుకున్న ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. జ్యూస్‌ బాటిల్‌ కొనుగోలు చేసినట్లు నటించి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. మహిళ కింద పడడంతో ఆమె మెడ వద్ద గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఢీకొని వ్యక్తి మృతి 
1
1/1

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement