ఆహాకారం!
ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు
చంద్రబాబు పాలనలో
అటకెక్కిన మెనూ
అవస్థలు పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని జిల్లా అధికారులు
పాఠశాలల్లో..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1,42,098 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరు అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సరైన వసతులు లేక ఇరుకై న గదులు, కట్టెల పొయ్యితో వంట కార్మికులు సైతం అగచాట్లు పడుతున్నారు. చాలా పాఠశాలల్లో అసలు వంట గదులు లేవు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తదితర పాఠశాలల్లో ఇళ్ల నుంచి వంట వండుకుని తీసుకొచ్చి పెడుతున్నారు. వంట సామగ్రి, బిల్లులు సకాలంలో అందక వంట కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పర్యవేక్షణ లోపం
మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్న సమయంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, అధికారుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. కానీ పర్యవేక్షణ చేసే సమయం కూడా తమకు ఉండడం లేదని పలువు రు హెచ్‌ఎంలు వాపోతున్నారు. వండుతున్న కార్మికులకు సైతం జీతాలు తక్కువగా ఇస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల అధికారులు నిత్యం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరు పర్యవేక్షించేవారు. ఆ సమయంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని వెంటనే సరిదిద్దేవారు. చంద్రబాబు పాలనలో మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చి చేతులు పైకెత్తేశారు.
గుర్తించిన సమస్యలు ఇవే
చిత్తూరు జిల్లాలో గురువారం
మధ్యాహ్నభోజనం అమలు తీరు సమాచారం
జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పాలకులు, అధికారులు గాలికొదిలేశారు. పేద బిడ్డలే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘పెట్టిందే మెనూ..నోరు మూసుకుని తిను’అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాసిరకం కూరలు, ముద్దకట్టిన అన్నం తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పస్తులతో పొట్టలు మాడ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ‘సాక్షి’ విజిట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లా సమాచారం
గురువారం మధ్యాహ్న భోజనం అమలు ఇలా
నాసిరకంగా
మధ్యాహ్న భోజనం
నాణ్యత లోపమే.. అసలు సమస్య
మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండడమే అస లు సమస్యగా మారింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు బడికొచ్చినా భోజనం చేయకుండా కడుపులు మాడ్చుకుంటున్నారు. నాణ్యత లేని కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు ఇతర వంట సామగ్రిని వినియోగిస్తున్నారు. ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు ఉంటుండడంతో మీ పిల్లలకై తే ఇలానే పెడతారా..? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
మెనూ అమలు ఎక్కడ?
జిల్లాలోని చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూను సరిగ్గా అమలు చేయడం లేదు. ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం లేదు. నాణ్యత బాగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్లు తీసుకెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేదు.
– సద్దాం, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్, జేఏసీ చైర్మన్
పక్కాగా అమలు చేస్తున్నాం
మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. ఎటువంటి సమస్యలున్నా అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. వంట చేసే కార్మికులకు నిత్యం ఆదేశాలిస్తున్నాం. పాఠశాలలో వంట చేసే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశిస్తున్నాం.
– రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు.
ఆహాకారం!
ఆహాకారం!
ఆహాకారం!


