బాధ్యతగా విధులు నిర్వర్తించండి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించండి

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

బాధ్యతగా విధులు నిర్వర్తించండి

బాధ్యతగా విధులు నిర్వర్తించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఐఈఆర్‌పీ (సహిత రిసోర్స్‌ పర్సన్లు) లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటరమణ అన్నారు. డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఐఈఆర్‌పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగ విద్యార్థుల వివరాలను విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్‌పెన్షనల్‌ లెర్నింగ్‌ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విధి విధానాలను ప్రతి ఐఈఆర్‌పీ తెలుసుకోవాలన్నారు. అనంతరం ఐఈఆర్‌పీలకు కార్యక్రమం అమలు తీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement