ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు

ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్నామలై జిల్లా, పోలూరు తాలూకా, పులియాన్‌ కుప్పం గ్రామానికి చెందిన పి శేఖర్కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్‌ అధికారి హరి ప్రసాద్‌, కానిస్టేబుల్‌ పళని కథనం మేరకు.. కార్వేటినగరం పోలీసులకు 2017 జనవరి 5వ తేదీ వచ్చిన సమాచారంతో కార్వేటినగరం మండలం, గురువరాజు గుంట సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐదుగురు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి ఐదు దుంగలుగా మార్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. 163 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసి, పుత్తూరు సెషన్స్‌ కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ దశలో నిందితుడు శేఖర్‌ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై విచారణ తప్పించి మిగిలిన నలుగురిపై కేసు విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం కేసుల విచారణ కోర్టు తిరుపతిలో ఏర్పాటు కావడంతో కేసు తిరుపతికి బదిలీ అయింది. పోలీసులు నిందితుడు శేఖర్‌ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు శేఖర్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement