రాయలసీమ ద్రోహి చంద్రబాబు
బంగారుపాళెం: రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుని సీమ కు ద్రోహం చేశారని పూతలపట్టు నియోజకవర్గ సమస్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ఆరోపించారు. బుధవారం బంగారుపాళెంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా నివాసంలో పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలతో కలసి ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమా ర్, లలితకుమారి మాట్లాడారు.
రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలన్న బృహత్తర సంకల్పంతో నాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పఽథకాని రూపకల్పన చేశారన్నారు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా 2002లో పథకాన్ని ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో రైతుల ఆశలను నీరుగార్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇది సీమ ప్రజలకు చేసిన తీవ్ర అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారన్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టాలనిచూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీమ ప్రజలు, రైతుల శ్రేయస్సు, హక్కుల సాధన కోసం వైఎస్సార్‌సీపీ అవిశ్రాంతంగా పోరాడుతుందని, ఈ దిశగా 5వ తేదీ నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పాలఏకరి రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, సింగిల్‌విండో మాజీ చైర్మన్ దత్తాత్రేయరెడ్డి, సీనియర్ నాయకులు థామస్, కృష్ణమూర్తి, సర్పంచులు వాణిప్రియ, శ్రీనివాసులు, ఉపసర్పంచ్ కామరాజు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఫిరోజ్, కార్యదర్శి రఘుపతిరాజు, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షాకీర్, శైలేష్, మహేంద్ర, సుధాకర్‌రెడ్డి, పరదేశి, జగదీష్, సుబ్రమణ్యం, హరి, ముబారక్, రఘు, ఖాదర్‌బాషా, హిద్దు, కుట్టి, బాబు, వెంకటప్ప, సన్మాన్ తదితరులు పాల్గొన్నారు.


