పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తాం
చిత్తూరు కార్పొరేషన్: పరిశ్రమల్లో తలెత్తే విద్యుత్ సమస్యలను పరిష్కారిస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ స్పష్టం చేవారు. బుధవారం ఎస్‌ఈ కార్యాలయంలో పారిశ్రామిక వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పరిశ్రమల అధికారులు, ఉద్యోగులు కార్యక్రమానికి వచ్చి సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా కెపాసిటర్లు సర్‌చార్జి ఎక్కువగా వస్తోందన్నారు. నూతన మీటర్ల ఏర్పాటు వల్ల వాడకం ఎక్కువగా చూపుతోందన్నారు. వాటిని రివైజ్డ్ చేయాలని కోరారు. అలాగే పరిశ్రమల సర్వీసులకు ఏబీ స్విచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా పరిశ్రమల్లో మొత్తం లైన్ సరఫరా అగిపోతోందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను ప్రతినెలా మూడో బుధవారం తిరుపతిలోని సీఎండీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో తెలియజేయాలని వివరించారు. ఈఈ మునిచంద్ర, ఏఓ బాలు, డీఈ బాలాజీ పాల్గొన్నారు.
వసతుల కల్పనపై దృష్టి
చిత్తూరు కార్పొరేషన్: పల్లెల్లో పన్నుల వసూళ్లతో పాటు వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ (పీఆర్) అదనపు కమిషనర్ సుధాకర్‌రావు తెలిపారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో ప్రధానంగా ఇంటింటి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, ట్యాంక్‌ల క్లీనింగ్, చెత్త సేకరణ పనులు ఉంటాయన్నారు. వీటి నిర్వహణను సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయాలన్నారు. పల్లెల్లో పన్నుల ద్వారా వచ్చే డబ్బుతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా నీటి వసతి, వీధి దీపాల నిర్వహణ, సకాలంలో చెత్త తీయడం, కాలువల శుభ్రత చేయించాలన్నారు. వేసవిలో నీటి కొరత లేకుండా చూడాలన్నారు. కార్యదర్శులు పనిచేయకపోతే సర్పంచులకు, డిప్యూటీ ఎంపీడీఓ, డీపీఓ, సీఈఓలకు చెడ్డపేరు వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ సాయిలహరి, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, డీపీఓ సుధాకర్‌రావు, డీడీఓలు రవికుమార్, రామచంద్ర, వాణి పాల్గొన్నారు.
పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తాం


