భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి విద్యార్థి

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

భారత

భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి విద్యార్థి

నగరి : భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి పట్టణంలోని శ్రీ వివేకానంద జూనియర్‌ కళాశాలకు చెందిన కేసీ తేజేష్‌ ఎంపికై నట్లు ఆ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పి.బాలాజీ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వెంకటస్వామి, చైర్మన్‌ పీ.జగన్నాథంనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు తమిళనాడు ఈరోడ్‌ ఎక్సెల్‌ కళాశాలలో జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు జరిగాయని, ఆ పోటీల్లో మన రాష్ట్ర జట్లు 3వ స్థానాన్ని కై వసం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన నగరి పట్టణానికి చెందిన కేసీ తేజేష్‌ మార్చిలో మలేషియా, థాయ్‌లాండ్‌లో నిర్వహించే అంతర్జాతీయ టెస్ట్‌ సీరిస్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికై నట్లు ప్రకటించారు. క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందన్నారు. భారత జట్టుకు ఎంపికై న విద్యార్థికి బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు అభినందనలు తెలిపారు.

భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి విద్యార్థి 1
1/1

భారత బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు నగరి విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement