తప్పుల తడకగా భూ రీసర్వే
పాలసముద్రం : చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే తప్పుల తడకగా మారింది. గత నెల 2 నుంచి చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ఈ విషయం తేటతెల్లమైంది. కొందరు రైతుల ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు తప్పుగా నమోదై ఉన్నాయి. మరికొందరి ఒరిజినల్ పట్టా భూములు ప్రభుత్వ భూములు గానూ.. వాగు పోరంబోకుగాను చూపిస్తున్నాయి. ఇంకొందరివి ఉండాల్సిన భూముల విస్తీర్ణం కంటే తక్కువగా నమోదు చూపాయి. వీటి సవరణ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళితే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలని అక్కడి అధికారులు ఉచిత సహాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
చలానా పెంపు
రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుకం తెరిసే సుమారు 50 మంది పేర్లు ముంద్రిచి ఉన్నాయి. వీటికి తోడు 5 ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయి. ఈ పాసుపుస్తకం తీసుకెళితే బ్యాంకులో ఉన్న లోన్లు కూడా రెన్యూవల్ కావు. ఇదేమని అడిగితే ఎల్‌ఎంఎం నంబర్ల విభజనకు చలానా కట్టాలని సూచిస్తున్నారు. అయితే సుమారు 100 మంది రైతుల్లో చలానా ఎవరూ కట్టాలి అంటే నాలుగైదుగురికి ఒక ఎల్‌పీఎం నంబర్ ఉంది. వాటిలో ఏ ఒక్కరు చలానా కట్టినా సరిపోతుందని చెబుతున్నారు. పైగా రూ.60 నుంచి రూ.500కు చలానా మొత్తం పెంచడంతో రైతులు మండి పడుతున్నారు.
రైతులకు అదనపు భారం
రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలపై రైతులు గత రెండేళ్లుగా మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కొందరు రైతులు తమ భూములకు సంబంధించి ఆర్‌హెచ్ నకళ్లు, ఈసీలు డాక్యూమెంట్లు ఇచ్చినా వాటిని జాయింట్ కలెక్టర్‌కు పంపామని, అక్కడి నుంచి రావాల్సిందేనని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. ఆముదాల రెవెన్యూ పరిధిలో తమకు ఉండాల్సిన భూమికంటే తక్కువ భూమి 1–బీలో చూపు తోందని కొందరు రైతులు పేర్కొంటున్నారు.


