నేడు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

నేడు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

నేడు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

తిరుపతి మంగళం : తిరుపతి పద్మావతిపురంలో బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూ రు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, మేయర్‌ శిరీష పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

నేడు విద్యుత్‌ గ్రీవెన్స్‌

చిత్తూరు కార్పొరేషన్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు అర్బన్‌ ఈఈ మునిచంద్ర తెలిపారు. స్థానిక గాంధీ రోడ్డులోని డివిజన్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. చిత్తూ రు, పూతలపట్టు నియోజకవర్గాల వినియోగదారుల సమస్యలను రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు.

శిక్షణ సమన్వయకర్త నియామకం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లా వనరుల కేంద్రం కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న వాసును జిల్లా రైతు శిక్షణ సమన్వయకర్తగా ఇనన్‌చార్జిగా నియమించారు. మంగళవారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. రైతులకు వ్యవసాయ రంగంలో రాణించేలా శిక్షణలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement