ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగులు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగులు

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగులు

ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగులు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసు జిల్లాలో ముగ్గురు ఎస్‌ఐలకు పోస్టింగులు ఇస్తూ ఎస్పీ తుషార్‌డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. వేకెంట్‌ రిజర్వు (వీఆర్‌)లో ఉన్న శ్రీనివాసులును పెనుమూరుకు, వెంకటరమణను చిత్తూరు తాలూకకు, పెనుమూరులో ఉన్న వెంకట నరసింహను చిత్తూరు వన్‌టౌన్‌కు బదిలీ చేశారు.

జిల్లాలో 2,442 టన్నుల యూరియా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో 2,442 టన్నుల యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. ఆర్బీకే పరిధిలోనే ఈ యూరియాను అధికంగా ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం మరో 400 టన్నుల యూరియా రానుందన్నారు. ఆ యూరియాను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు అందేలా చూస్తామన్నారు.

బి.కొత్తకోట ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుడిపాల, బి.కొత్తకోట ఎంపీపీల స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. బి.కొత్తకోట ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళ కావడంతో, ఎంపీటీసీలు ఎవ్వరూ ఆ కేటగిరీకి చెందిన వారు లేకపోవడంతో పోటీ చేయలేదు. అధికారులు ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. అసలు సమస్యను ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గుడిపాలలో ఎంపీటీసీ జి.హరిప్రసాద్‌ చౌదరి ఎంపీపీగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు.

అడిగిన చోటుకి పోస్టింగ్‌ ఇస్తే రూ.20 వేలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లా వ్యాప్తంగా గతనెల సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లల్లో ఈ సంజీవని కేంద్రాని ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ముందుగా 136 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్లకు శిక్షణ ఇచ్చి స్థానం కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను కూడా వైద్య ఆరోగ్యశాఖలోని కొందరు కాసుల వర్షం కురిపించుకునేపనిలో పడ్డారు. అడిగిన చోటుకు పోస్టింగ్‌ ఇస్తే రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసి ఇకొంత మంది డిమాండ్‌ను పెంచారు. రూ.30 వేల నుంచి రూ.40వేలు ఇస్తామని.. ఆ చోటుకు ఆర్డర్‌ ఇవ్వాలని ముందుకొస్తున్నట్టు సమాచారం.

రైలు కిందపడి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

పుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై బుధవారం సుమారు 50 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటిపై క్రీమ్‌ కలర్‌ ఆఫ్‌ షర్టు, కాషాయం కలర్‌ పంచె, స్కైబ్లూ డ్రాయర్‌ ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. రేణిగుంట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఘర్షణలో యువకుడి మృతి!

బంగారుపాళెం: మామిడి చెట్లకు మందు కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు స్ఫృ హతప్పి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటన బుధవారం మండలంలోని సదకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సదకుప్పం దళితవాడకు చెందిన మనోజ్‌, చరణ్‌, జానకీరామ్‌, సిద్దు నలుగురూ రైతు బాలిరెడ్డి మామిడి తోటలో చెట్లకు మందు కొట్టేందుకు కూలి పనులుకు వెళ్లారు. ఈ క్రమంలో మనోజ్‌, చరణ్‌కు మధ్య గొడ జరిగింది. చరణ్‌, అతని అన్న జానకీరామ్‌ ఇద్దరు మనోజ్‌ను తీవ్రంగా కొట్టడంతో స్ఫృహతప్పి పడిపోయాడు. మనోజ్‌ను చికిత్స నిమిత్తం అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మనోజ్‌(20) మృతి చెందినట్లు తెలిపారు. కాగా మనోజ్‌కు ఏడాది క్రిత మే వివాహమైంది. మనోజ్‌ భార్య గర్భవతి. గతంలో చరణ్‌, మనోజ్‌కు మధ్య పాత గొడలు న్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

డ్రోన్‌ సేవలు ప్రారంభం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): 2024–25 సంవత్సరానికి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 31 కిసాన్‌ డ్రోన్లను 80శాతం సబ్సిడీతో రైతులకు అందింస్తున్నట్టు డీఏఓ మురళి తెలిపారు. రైతులు డ్రోన్లను ఉపయోగించి పంటలకు వచ్చే తెగుళ్లు, పురుగులను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా రైతులు క్యాబ్‌ లాంటి విధంగా ఆన్‌న్‌లైన్‌లో డ్రోన్లను బుక్‌ చేసుకోవచ్చన్నారు. రైతులు కిసాన్‌ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసిన తర్వాత, సమీపంలో ఉన్న డ్రోన్లను యాప్‌ చూపిస్తుందన్నారు. దీని ఆధారంగా డ్రోన్‌ సేవలను ఆన్‌న్‌లైనన్‌లో బుక్‌ చేయొచ్చన్నారు. గ్రామ రైతు సేవా కేంద్రాల్లోని వాల్‌పోస్టర్లపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవడం ద్వారా కూడా డ్రోన్లను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement