వరసిద్దుడి సేవలో మాజీ న్యాయమూర్తులు | - | Sakshi
Sakshi News home page

వరసిద్దుడి సేవలో మాజీ న్యాయమూర్తులు

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

వరసిద్దుడి సేవలో మాజీ న్యాయమూర్తులు

వరసిద్దుడి సేవలో మాజీ న్యాయమూర్తులు

కాణిపాకం : కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.వీ. రవీంద్రన్‌, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌. సత్యనారాయణ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెంచల కిషోర్‌ వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ప్రొటో కాల్‌ ఏఈఓ ధనపాల్‌ పాల్గొన్నారు.

కరెంటోళ్ల జనబాటలో

17 పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్ల నందు అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 110 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా 6, ఎల్‌టీ లైన్ల పరంగా 60, సర్వీసు లైన్‌ పరంగా 15 కలిపి మొత్తం 185 సమస్యలను గుర్తించినట్లు ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. వాటిలో 17 సమస్యలను పరిష్కరించామన్నారు.

నేడు పారిశ్రామిక

పరిష్కార వేదిక

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలోని పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నారు. స్థానిక ఎస్‌ఈ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు గంట సేపు తమ సమస్యలను పరిశ్రమదారులు తెలపవచ్చన్నారు. జిల్లాలో మొదటి బుధవారం, తిరుపతి జిల్లాలోని డిస్కం కార్యాలయంలో మూడో బుధవారం కార్యక్రమం ఉంటుందన్నారు.

మాజీ సైనికుల

సంక్షేమానికి ప్రాధాన్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా సైని క సంక్షేమ శాఖ అధికారి రాఘవులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవనంలో మంగళవారం ఫీల్డ్‌ మార్షల్‌ జనరల్‌ కరియప్ప సేవల కు గుర్తింపుగా వెటర్నర్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. త్రివిధ దళాలలో 70 ఏళ్లకు పైబ డిన 62 మంది మాజీ సైనికులను కార్యక్రమంలో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ప్రతి సైనికుడి సేవలు ఎనలేనివన్నారు. సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సైనికుల కుటుంబీకులకు ఎటువంటి సమస్యలు ఎదురైన జిల్లా సైనిక సంక్షేమ శాఖలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌ వివేక్‌ మోనిష్‌, లెప్ట్‌నెంట్‌ కల్నల్‌ లోకనాథం, గ్రూప్‌ కమాండర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement