జాగ్రత్తలతో అభయం | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో అభయం

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

జాగ్ర

జాగ్రత్తలతో అభయం

● అటవీ ప్రాంతంలో సంచరించేవారు ఎట్టి పరిస్థితుల్లో కింద కూర్చోవడం కానీ, ఒంగి నడవడం కానీ చేయరాదు. ● ఘాట్‌ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను అడవిలో నిలపరాదు. అలాగే చిరుతిళ్లు, అల్పాహారం తినడానికి అడవిలో వాహనాలు నిలపరాదు. ● అడవుల్లో సంచరించేవారు చేతిలో ఒక పట్టుడు కర్రలాంటిది ఉంచుకోవాలి. ఆ కర్ర మనిషిని ఆకారాన్ని పెద్దదిగా చేసి చూపడంతో చిరుతల్లాంటి వన్యప్రాణులు భయపడి దగ్గరకు రావు. ● రాత్రిళ్లు అటవీ ప్రాంతంలో వెళ్లకుండా ఉండడం మంచిది.

29 నవంబరు 2011లో జిల్లాలోని పెద్దపంజాణిలో వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో చిరుత మరణించింది.

09 నవంబరు 2022లో యాదమరి పరిధిలో వేటగాళ్ల ఉచ్చుకు చిరుత దొరికింది. చనిపోయిన పులితో పట్టు కున్న ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవడంతో అధికారులు ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

25 జూలై 2023లో కుప్పం అటవీ ప్రాంతం సరిహద్దులో విద్యుదాఘాతంతో చిరుత మృతి చెందింది.

11 నవంబరు 2023లో గుర్తు తెలియని వాహనం ఢీ కొని మరణించింది

20 అక్టోబరు 2024లో యాదమరి మండలంలో పులిని హతమార్చిన ఐదుగురిని జైలుకుపంపారు.

21 అక్టోబరు 2024లో సోమల మండలంలో ప్ర మాదవశాత్తు గుంతలో పడి పులి మరణించింది.

29న నగర పరిఽధిలోని సీజీపల్లె వద్ద మెట్టు లేని పాడుపడిన బావిలో పొరబాటున చిరుత పడిపోయింది. పైకి రాలేక మరణించింది. చిరుత అక్కడ పడకపోయి ఉంటే సమీపంలో ఉండే వచ్చే అవకాశాలు ఎక్కువ.

చిరుత భయం..

చిరుతల నుంచి రక్షించుకోవాలి

చిత్తూరు కార్పొరేషన్‌: ఇటీవల జిల్లాలోని పలు గ్రామాల సమీపంలో చిరుతల సంచారం పెరుగుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పశువులపై దాడి చేసి సంఘటనలు జరిగాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతల సంచారం సహజమని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుతల రాకపై అనుమానాలు ఉంటే సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.

ఆహారం కోసం

సాధారణంగా చిరుతలు ఎక్కడైనా మనుగడ సాగించగల పిల్లి జాతి జంతువులు. వీటికి దట్టమైన అడవులే అవసరం లేదు. అటవీ ప్రాంతాల్లో మేత కోసం గొర్రెల మందలను తీసుకెళ్లే సమయంలో వాటి వెంట నడిచే కుక్కల శబ్దం చిరుతను ఆకర్షిస్తుంది. దీంతో మందలను చిరుతలను అనుసరిస్తూ గ్రామాల్లోకి గాని, గొర్రెల మందలు నిలిపే పెంటల వద్దకు గానీ చిరుతలు చేరుకుంటాయి. అదును చూసి అక్కడ ఉండే కుక్కలను ఎత్తుకు పోతుంటాయి. అప్పుడప్పుడూ ఇతర జీవుల పై దాడులు చేస్తుంటాయి. పెద్దపులులు అభయారణ్యంలో ఉండడంతో సహజంగా చిరుతలు జనావాసాల సమీపంలో తిరుగాడడం సహజమైన అంశమే.

ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులపై దాడి

సాధారణంగా చిరుతలు ఆహారం కోసం మనుషులపై దాడులు చేయవు. రెండు కాళ్లపై సంచరించే ఏ జంతువు (మనిషి) చిరుతలకు ఆహారం కాదు. చిరుతలు మనుషులకు కనిపించకుండానే సంచరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లో పిల్లలతో సంచరించేటప్పుడు పెద్దవారు తగు జాగ్రత్తలతో ఉండాలి. అటవీ ప్రాంతాల్లో వంగి పనిచేయడమో, ఆహారం తినేందుకు కింద కూర్చోవడమో చేయడం ద్వారా చిరుతలకు మనుషులు ఆహారం జంతువులుగా అనిపిస్తారు. ఈ సమయంలోనే ఎక్కువ దాడులు జరుగుతుంటాయి.

అప్రమత్తంగా ఉండాలి

ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప చిరుత సాధారణంగా మనుషులపై దాడి చేయడానికి సిద్ధమవ్వడు. చిరుత అడవుల్లో కాక, మైదాన ప్రాంతాలు, పట్టణ శివార్లలోనూ ఉండగలిగే వన్యప్రాణి. చిరుతలకు కుక్కలపై మక్కువ ఎక్కువ. అందకే వాటిని అనుసరిస్తూ గ్రామాల్లోకి, అటవీ సమీప జనావాసాల్లోకి వస్తుంటాయి. జనావాసాల్లో చిరుత కనిపిస్తే దాడి చేయొద్దు. వెంటనే సమీపంలోని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. చిరుతలాంటి వన్యప్రాణులకు హాని కలిగిస్తే శిక్షార్హులవుతారు. – సుబ్బురాజు, డీఎఫ్‌ఓ

జాగ్రత్తలతో అభయం 1
1/1

జాగ్రత్తలతో అభయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement