కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి! | Assassination attempt on old women | Sakshi
Sakshi News home page

కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!

Feb 6 2026 5:16 AM | Updated on Feb 6 2026 5:16 AM

Assassination attempt on old women

37 ఏళ్ల వివాహితతో 17 ఏళ్ల బాలుడి అక్రమ సంబంధం

ఆమె చెప్పడంతో వివాహిత అత్తపై హత్యాయత్నం

చిత్తూరు అర్బన్‌: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. 

వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement